Breaking News

పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

-మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారు
-గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం
-సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా
-ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రి 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి.వి. సింధు మాట్లాడుతూ “పాలనా వ్యవహారాలు కొత్తే అయినా పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుంది. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేయబడిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం.
సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయి. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులోనూ ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ దార్శనికత్వంలో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *