Breaking News

ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించాలని అన్నారు.

ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు మొత్తం 18 ఫిర్యాదులు అందగా అందులో పట్టిన ప్రణాళిక సంబంధించినవి 8, ఎస్టేట్ 1 ఇంజనీరింగ్ 5, రెవెన్యూ విభాగం 3, VAS 1.

ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) వి.చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్)చంద్రశేఖర్, ఆర్ ఎఫ్ ఓ మల్యాద్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణ, వి ఏ ఎస్ డి.హరీష్, బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *