Breaking News

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రిటర్నబుల్ ప్లాట్ల రీ ఎలాట్మెంట్, ల్యాండ్ పూలింగ్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IAS, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IASకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్(సీజీసీ) వద్ద ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని.. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” జరుగుతుందన్నారు. నేడు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 53 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

గ్రీవెన్స్ డేలో డిప్యూటీ కలెక్టర్ & APCRDA గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, సర్వే విభాగ డిప్యూటీ డైరెక్టర్ జి.పాండురంగ రామకృష్ణన్, అడిషనల్ డైరెక్టర్(లీగల్) ఎం.వెంకటేశ్వరరావు, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి. సురేష్ కుమార్, డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ డైరెక్టర్ వి.సునీత, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, కమ్యూనికేషన్స్ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు, IT విభాగ అడిషనల్ డైరెక్టర్ కుశ్వంత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.ఎస్.భాగ్యరేఖ, పి. పద్మావతి, బి. సాయి శ్రీనివాస నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *