-బొండా కుటుంబం సేవలు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు మంగళవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మరోసారి తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 14 మంది కి ప్రతీ నెల రూ.4000 రూపాయలు పెన్షన్ నగదును అందజేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా ప్రభుత్వం నుండి అందవలసిన పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను గుర్తించి, వారికి అండగా నిలుస్తూ 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన ముస్లిం మైనారిటీ వృద్ధురాలు SD. బషీరున్నీసాకి, SK. సుభాని కి, అలాగే 24వ డివిజన్ గిరిపురం కు చెందిన కంభంపాటి సావిత్రి కి ప్రతినెలా తన సొంత నిధుల నుండి ఒక్కొక్కరికి రూ.4000/- చొప్పున పెన్షన్ అందజేస్తూ నిజమైన ప్రజా నాయకుడిగా నిలుస్తున్నారు. ప్రభుత్వ సహాయం అంటే వరకు వేచి చూడకుండా తన సొంత డబ్బులతో ముందుకు వచ్చి పేదల బతుకులకు అండగా నిలవడం బొండా ఉమా సేవా దృక్పథానికి నిదర్శనం…
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్దార్ధ ని కలిసిన లబ్ధిదారులు తమ అనుభవాలను తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు, కంభంపాటి సావిత్రి మాట్లాడుతూ:- గత ఏడాది నుంచి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనను ఆదుకుంటూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ అందజేస్తున్నారని, ఈ సహాయం తనకు జీవనాధారంగా మారిందని, ఇలాంటి నాయకుడు తమకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా SD. బషీరున్నీసా, SK. సుభాని మాట్లాడుతూ:- సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇంత దగ్గరగా ప్రజల సమస్యలను గుర్తించి, వెంటనే స్పందించే నాయకుడు అరుదుగా కనిపిస్తారని, ముఖ్యంగా మైనారిటీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు నని, పేదల బాధను తన బాధగా భావించి, ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా ముందుండి సహాయం చేయడం బొండా ఉమా ప్రత్యేకత అని ఇటువంటి నాయకులను గెలిపించుకొవడం తమ అదృష్టమని, ప్రజలు కూడా ఎప్పుడు మంచి చేసే వారి వెనకే ఉంటారని రాబోయే రోజులలో కూడా వీరికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News