Breaking News

APCRDA ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ సదస్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పదో తరగతి పాసైన విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా APCRDA మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. పదో తరగతి అనంతరం ఉండే విద్య & ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం తుళ్లూరు HSR కళ్యాణ వేదికలో అవగాహన సదస్సును CRDA సోషల్ డెవలప్మెంట్ విభాగం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పలువురు రాజధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు Col. వి.రాములు, గ్రూప్ డైరెక్టర్- సోషల్ డెవలప్మెంట్(APCRDA), ఏ.కృష్ణమోహన్, కార్యదర్శి- APREIS, ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ వారు స్పీకర్స్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి గౌరవ స్పీకర్స్.. ఉన్నత విద్యలో లభించే అవకాశాలు, వివిధ కోర్సులు, ప్రభుత్వ పథకాలు, అలాగే భవిష్యత్తులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అలాగే సదస్సులో పాల్గొన్న విద్యార్థులు అడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు.

సదస్సులో APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగం గ్రూప్ డైరెక్టర్ కల్నల్ వి. రాములు గారు మాట్లాడుతూ, అమరావతి ప్రాంత విద్యార్థులు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అలాగే ఏ. కృష్ణమోహన్ గారు విద్యార్థులకు విద్యా అవకాశాలు, పోటీ పరీక్షలు, తదితర కెరీర్ ఎంపికలపై విలువైన సూచనలు అందించారు.

ప్రజారాజధాని అమరావతి అభివృద్ధితో పాటు అక్కడి గ్రామాల ప్రజల సామాజిక, విద్యా అభివృద్ధికి కూడా APCRDA ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని గ్రూప్ డైరెక్టర్ గారు చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంత యువతకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో మంత్రివర్యులు డా.పొంగూరు నారాయణ గారు, కమిషనర్ వి.విజయరామరాజు IAS గారి సూచనలమేరకు APCRDA సోషల్ డెవలప్మెంట్ అధికారులు అమరావతిలో ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోందని గ్రూప్ డైరెక్టర్ గారు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం పలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైతం ఇలాంటి ఉపయుక్తమైన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు APCRDA కట్టుబడి ఉందన్నారు. CRDA సోషల్ డెవలప్మెంట్ విభాగ సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *