విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం సాయంత్రం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, బందర్ రోడ్లు డ్రోన్ ఎల్ఈడి ద్వారా స్వచ్ఛ సర్వేక్షన్ ఓటింగ్ పై వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో భాగంగా ప్రజల అభిప్రాయ సేకరణ ప్రారంభమైందని తెలిపారు. నగర పరిశుభ్రత, పారిశుధ్య సేవలు, చెత్త సేకరణ, మరుగుదొడ్లు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను అధికారిక లింక్ https://cf.sbmurban.org/ ద్వారా తెలియజేయవచ్చన్నారు. అభిప్రాయ సేకరణలో భాగంగా అందుబాటులో ఉన్న 13 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, విజయవాడ నగరాన్ని “సూపర్ స్వచ్ఛ సిటీ”గా నిలిపేందుకు ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న జనగణన ప్రక్రియలో కూడా ప్రజలు పూర్తి సహకారం అందించి, ఎన్యుమేరేటర్లకు సరైన సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిశుభ్రమైన, సమగ్ర అభివృద్ధి చెందిన విజయవాడ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఈ ఎల్ డి డ్రోన్ ద్వారా అవగాహన కల్పించారు.
Prajavartha Online Telugu News