-రూ. 42 లక్షల వ్యయంతో నిర్మించిన ‘స్వర్ణ గ్రామం’ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
-రూ. 15 లక్షలతో నిర్మించనున్న ఐదు సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన
-గ్రామాభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 2.13 కోట్ల నిధులు కేటాయింపు
-ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వర్ణాంధ్ర కార్యక్రమం: ఎమ్మెల్యే యార్లగడ్డ
-పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలని పిలుపు
-పి. నైనవరం సహా రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో విలీనం చేసేందుకు ప్రతిపాదన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం పి. నైనవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అనంతరం రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఐదు సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసి, రూ.42 లక్షల వ్యయంతో నిర్మించిన స్వర్ణ గ్రామం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పి. నైనవరం గ్రామంలో సచివాలయం ప్రారంభంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, గ్రామంలోని దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు పంచాయతీ నిధుల నుంచి నిధులు కేటాయించినట్లు చెప్పారు. గ్రామంలో సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ సెంటర్ భవనం, సీసీ డ్రైన్లు, జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్, పైప్‌లైన్ పనులు, ట్రాన్స్‌ఫార్మర్లు, రహదారి ప్యాచ్ వర్క్ వంటి అభివృద్ధి పనులకు మొత్తం రూ.2.13 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. పి. నైనవరం సహా తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో విలీనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలుమార్లు కోరినట్లు తెలిపారు. సెన్సస్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఈ గ్రామాలను వీఎంసీలో కలిపేందుకు చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల గ్రామాల్లో చెరువులు ప్రమాదకరంగా మారాయని, చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తమకు ప్రజలు, రైతులు, మీడియా మిత్రులు సహకరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సుంకర సుగుణ, ఎంపీడీఓ పార్థసారధి, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, పి.నైనవరం గ్రామ టిడిపి అధ్యక్షులు బెజవాడ రామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జి గుజ్జర్లపూడి బాబురావు, చప్పిడి వెంకట రమేష్, యూనిట్ ఇంచార్జి షేక్ నబీ, దావు హనుమంతరావు, బోనిగే వెంకటేశ్వరరావు, తోకల చిన్నబాబు, షేక్ మెయిన్, ఎస్.కే మీరావలి, కలతోటి శ్రీనివాసరెడ్డి, గంపా శ్రీనివాసరావు, చల్లగాలి సునీల్, పట్టపు చంటి, కొండేటి వెంకటరత్నం, బెజవాడ నాగేశ్వరరావు, కొండేటి శ్రీనివాసరావు, మెడగాని శ్రీనివాసరావు, బెజవాడ శ్రీనివాసరావు, మాదు రాంప్రసాద్, దేవరపల్లి కోటేశ్వరరావు, లింగం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News