Breaking News

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట మసీదు వద్ద సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 54, 55 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. శంకర్ నేత్ర చికిత్సాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆంధ్ర హాస్పటల్ వారి మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఉమ్మడి కృష్ణజిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎమ్మెస్ బేగ్,
54వ డివిజన్ టిడిపి నాయకులు అబ్దుల్ హర్షద్, 54వ డివిజన్ టిడిపి అధ్యక్షులు షేక్ తారీక్ అజీజ్, బీజేపీ 54 డివిజన్ ఇంచార్జ్ మిల్టన్ జైన్ , షర్మిల ఠాగూర్ జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ తాజుద్దీన్, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు కిరణ్, వెంకట రమణ, హరీష్ , సుజనా మిత్ర లు పాల్గొన్నారు. ఆదివారం కూడా ఈ క్యాంప్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *