విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతో వృత్తి నైపుణ్యంతో తరతరాలుగా సమాజానికి సేవలందిస్తూ రాష్ట్రంలో 28 రకాలకు పైగా ఉన్న చేతి వృత్తి దారు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే పూనుకోవాలని చేతి వృత్తి దారుల సమాఖ్య ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు డిమాండ్ చేశారు.18 -05- 2026న చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు విజయవాడలో గాంధీనగర్ లో ఉన్న విజయవాడ సెంట్రల్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో సమాఖ్య జిల్లా అధ్యక్షులు తాడి పైడయ్య అధ్యక్షతన జరిగిన “ధర్నా”ను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికలముందు అధికారంలోకి రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం కన్నా భిన్నంగా చేతి వృత్తి దారులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ చేతి వృత్తి దారులకు ఇచ్చిన హామీలు ప్రధానంగా పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, గత ప్రభుత్వం కంటే ఎక్కువగా 62 కుల,వృత్తుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వృత్తిదారులకు రుణాలు ఇస్తామన్న హామీ, 50 సంవత్సరాలు నిండిన చేతి వృత్తి దారులకు పెన్షన్లు,ఉచిత విద్యుత్ సౌకర్యం నేటికీ అమలు కాలేదన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కి పేదలకు, చేతి వృత్తి దారులకు ఇచ్చిన హామీలు పక్కనపెట్టి నగర పట్టణాల్లో అత్యంత విలువైన భూములను ప్రభుత్వ భూములను కారుచౌకగా దారాదత్తం చేయడం చేతి వృత్తి దారులను విస్మరించడం కాదా? అని ప్రశ్నించారు.
మారిన నూతన సాంకేతిక యంత్ర పరికరాలను కొనుగోలు చేయలేక, కొనడానికి ప్రభుత్వాలు సహకరించకపోవడం వల్ల డబ్బున్న కార్పొరేట్ కంపెనీలు సాంప్రదాయ చేతి వృత్తులలోకి చొరబడి చేతి వృత్తులును కబళించడం వల్ల చేతి వృత్తిదారులు తమ వృత్తులను వదిలి ఉపాధి కోల్పోయి ఇతర వ్యాపకాలకు వెళుతున్నారని చేతి వృత్తి దారుల ను ఆదుకోకపోతే ఉద్యమలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.చేతి వృత్తి దారుల సమాఖ్య ఎన్ టి ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచాకుల శ్రీనివాస్ రావు మాట్లాతూ చేతి వృత్తి దారులు తయారుచేసిన ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమైందని చేతి వృత్తి దారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సౌకర్యం ఇచ్చిన హామీ కూడా చేతి వృత్తి దారులందరికీ వర్తింపచేయడం లేదు. అందుకే ఇప్పటికైనా చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హెచ్చరించారు.అనంతరం చేతి వృత్తిదారులకు తక్షణమే వృత్తుల కార్పొరేషన్ల ద్వారా ఆదరణ పథకం కింద ప్రతి చేతి వృత్తి దారునికి ఐదు లక్షల రూపాయలు తగ్గకుండా 90 శాతం సబ్సిడీతో స్వంత పూచి కత్తు తో రుణాలు ఇవ్వాలని,50 సంవత్సరాలు నిండిన చేతి వృత్తి దారులకు పెన్షన్లు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చేతి వృత్తి దారులు తయారు చేసిన ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ సౌకర్యం కల్పించాలని, చేతి వృత్తి దారులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు సౌకర్యం అందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బుద్ధారపు వెంకట్రావు , చేతి వృత్తి దారుల సమాఖ్య జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు బివి ఆంజనేయులు,వెంకటరామయ్య, సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు మోకా దుర్గారావు,జే.నాగరాజు, డి హెచ్ పి ఎస్ నగర ప్రధాన కార్యదర్శి ఎస్ పేరయ్య, ఏఐటి యు సి నగర నాయకులు కొట్టు రమణారావు,నగర నాయకులు కొండపల్లి కృష్ణ,సిహెచ్ ఎల్ మారుతి,చాక్యతల తులసి వర్మ,కొరవి చిన్నారావు సిహెచ్ విజయ ప్రభాకర్ వెంకటరత్నం పీ.కామ రాజ్ తదితరులు పాల్గొన్నారు.. రాచాకుల శ్రీనివాస్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, చేతి వృత్తి దారుల సమాఖ్య ఎపి, ఎన్ టి ఆర్ జిల్లా సమితి.9866715697.
Prajavartha Online Telugu News