Breaking News

ఆంధ్రరత్న భవన్ లో రాజీవ్ గాంధీ వర్ధంతి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ఆధునీకరణకు, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు అవకాశాలు కల్పించడంలోను, దేశ ఐక్యత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలనుకొండ శివాజీ, షేక్ ఖుర్షిదా, గడ్డం పాల్ విజయ్, నరహరశెట్టి నరసింహ రావు, భేగ్, అన్సారీ, అల్లం రాజేష్ తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *