Breaking News

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనుహ్య స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ప్రజల కోసం భవానిపురం , ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. పశ్చిమ లోని వివిధ వర్గాల ప్రజలు భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయ నిధి, తాగునీరు, ఇళ్ల స్థలాలు కొరకు దరఖాస్తులు, వైద్య సహాయం వంటి వివిధ సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు బుల్లబ్బాయి ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు,బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు,
39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, జనసేన సిటీ సెక్రటరీ శనివారపు శివ, 34 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రుద్రపాటి వెంకటేష్, 42 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బెన్నా భక్తుల సోమేశ్వరరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి కృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *