-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో ఒక రోజు పర్యటించనున్న నేపథ్యంలో జూన్ 09 న తిరుపతికి విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మంగళవారం ఉ.10.40 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అనంతరం తిరుపతి రూరల్ మండల పరిధిలో గల దామినేడు గ్రామం వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్ డి ఏ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. కార్యక్రమం ముగించుకుని మద్యాహ్నం 2 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హెలికాప్టర్ లో ఉండవల్లి చేరుకుంటారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News