విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా చేపట్టిన పనులను పెండింగ్ లో లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమీషనరు కోన శశిధర్ అధికారులను ఆదేశించారు.
పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ కోన శశిధర్ శాఖా పరంగా చేపట్టి అమలు చేస్తున్న పలు పథకాలకు సంబందించిన అంశాల పై శుక్రవారం తాడేపల్లి ప్రధాన కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్లు(అభివృద్ది),పంచాయితీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టరు శివ శంకర్, పంచాయితీరాజ్, డీపీవో, డ్వామా అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమీషనర్ జిల్లాల వారీ అధికారులతో పలు అంశాలపై శాఖా పరంగా చేపట్టి అమలు చేస్తున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు శివ శంకర్ జిల్లాలో కమీషనర్ కు వివరిస్తూ జిల్లాలో పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా చేపట్టిన జగనన్న స్వచ్చసంకల్పం, జగనన్న పాలవెల్లు, జగనన్న స్వచ్చ భూహక్కు భూరక్ష, మెటీరియల్ కాంపోనెంట్, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన భవనాలు, జాబ్ కార్డ్స్ అపడేషన్, గ్రామ పంచాయితీ అభివృద్ది అంశాలు, స్పందన పై పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయితీ రాజ్ ఎస్ఈ, డీపీవో జ్యోతి, డ్వామా పీడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …