-రైతు సంఘాల నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆమెరికాతో భారత దేశం చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం వలన వ్యవసాయ రంగం మరింత సంక్షొభంలో పడుతుందని, రైతుల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. మంగళవారం విజయవాడనగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వవిధ రైతు సంఘాల రాష్ట్ర నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఏపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య వలన దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు ధరలు మరింత పతనమౌతాయని రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెరికా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం భారతదేశం ఉత్పత్తులను దెబ్బతీయటమే ఆమెరికా లక్ష్మంమన్నారు. ఆమెరికాకు సాష్టంగా పడి భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేయటం సమజసం కాదన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. రైతులను సర్వనాశనం చేసే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకం చేయవద్దని భారత్ ను హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ
రాష్ట్రంలో తోతాపురి, పొగాకు, రొయ్యలు,టమాటా,జీడిమామిడితదితర రైతులు పండించిన పంటలకు ధరలు పడిపోయి తీవ్ర సంక్షోభంలో ఉన్నారని వీరిని ఆదుకోవడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. రైతుల ప్రయోజనాల కన్నా కంపెనీల ప్రయోజనాలే మిన్నంగా భావించి కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. రొయ్యల ఫీడ్ ధరలు పెరిగి సాగు భారంగా మారిందని ధరలు తగ్గించమని రైతులు ఆందోళన చేయగా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. తోతపూరిమామిడి కేజీ 12 రూపాయలకు కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వాటిని అమలు చేయకుండా ఉల్లంఘించిన మండీలు, రాంపులు, జ్యూస్ ఫ్యాక్టరీలపై వత్తిడి చేయకపోవడం రైతుల ప్రయోజనాలను పరోక్షంగా దెబ్బతీటమే అన్నారు. కేజీ పొగాకును 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఉత్తిత్తి ఆదేశాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టి సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలు జరిగితే భారత వ్యవసాయ రంగం కుదేలవుతుందన్నారు.
స్వేచ్ఛవాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకస్తూ రైతుల చేత సంతకాలు చేయించి రిజిస్టర్ ఫోస్టు ద్వారా వినతిపత్రాలను రాష్ట్రపతికి ఈ నెల 21 తేది లోపు పంపాలన్నారు.
జూలై 22 వ తేదిన రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రైతులను కోరారు.దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో పియం మోడీ, ట్రంప్ ల దిష్టి బోమ్మలు దహనం చేయటం ద్వారా నిరసన వ్యక్తం చేయలన్నారు.రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడు యలమందరావు మాట్లాడుతూ 22 న రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రమైన ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించస్తామని, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మరో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుల ఉధ్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఈ నెల 28, 29 తేదీలలో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సాధారణ సమావేశానికి ఏపి నుంచి అధిక సంఖ్యలో హాజరుకావాలని రైతు ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘాల రాష్ట్ర ప్రతినిధులు నరశింహారావు, సత్యనారాయణ, మరీదు ప్రసాద్ బాబు, కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News