Breaking News

రాష్ట్రంలో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల ఫేజ్-2 విస్తరణకు ప్రభుత్వం ఆమోదం : పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

-సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భూసేకరణకు పరిపాలనా అనుమతులు
-మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు రూ. 1638.52 కోట్లు మంజూరు
-రామాయపట్నం పోర్ట్ ఫేజ్-2 కోసం 2924.45 ఎకరాల భూసేకరణ.. రూ. 851 కోట్లు కేటాయింపు
-మూలాపేట పోర్ట్ విస్తరణకు 1903.39 ఎకరాల సేకరణ.. రూ. 440.52 కోట్లు మంజూరు
-మూలాపేటలో ఉప్పు భూముల సేకరణ, ఆర్ & ఆర్ (R&R) పనుల నిర్వహణ
-మచిలీపట్నం పోర్ట్ ఫేజ్-2 కోసం 1420.70 ఎకరాల సేకరణ.. రూ. 347 కోట్లు కేటాయింపు
-తిరుపతి జిల్లాలో నెక్సస్ ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ కు 63.01. ఎకరాల కేటాయింపులు
-రూ. 255 కోట్ల పెట్టుబడులతో, 1000 మందికి ఉపాధి కల్పించనున్న సంస్థ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తు అవసరాలు, పోర్టుల విస్తరణను దృష్టిలో ఉంచుకుని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి ఫేజ్ 2 లో భాగంగా భూసేకరణకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రామాయపట్నం, మూలాపేట, మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుల రెండో దశ విస్తరణకు మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 1638.52 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సచివాలయంలోని R&B, I&I శాఖ కార్యాలయంలో మంత్రి వెల్లడించారు.

మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 1420.70 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 347 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 1903.39 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 440.52 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.. ఉప్పు భూములు (SALT LANDS) తో కలిపి దాదాపుగా ఈ 1903 ఎకరాల భూముల్లో భూసేకరణ చేయనున్నామన్నారు. అలాగే ఆర్ & ఆర్ కూడా ఇందులోనే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 2924.45 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 851 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.

తిరుపతి జిల్లాలో ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ కు 63.01. ఎకరాల కేటాయింపులు

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్న ఈటివాకం గ్రామంలో ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు 63.01 ఎకరాలు కేటాయించినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు…నెక్సస్ ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ సంస్థ ప్రతిపాదనల మేరకు ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా భూమి కేటాయింపులు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. నెక్సస్ ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ సంస్థ స్థానికంగా దాదాపు రూ. 255 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన క్రమంలో దాదాపు 63 ఎకరాల భూమిని సదరు సంస్థకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు ద్వారా స్థానికంగా వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు మంత్రి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *