Breaking News

ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పై సోమవారం ప్రజా వేదిక…

-ఎమ్ పి.డి.ఓ., పి.జగదాంబ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలం పరిధిలో ది.1.4.2019 నుంచి ది.31.3.2020 మరియు ది.1.4.2020 నుంచి ది.31.3.2021 వరకు జరిగిన “ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ ” పనులపై సామాజిక తనిఖీ అనంతరం ది.22.11.2021న “ప్రజా వేదిక” ను నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్తు అభివృద్ధి అధికారి పి. జగదాంబ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.

కొవ్వూరు మండలం పరిధిలోని 16 గ్రామాల్లో ది.1.4.2019 నుంచి ది.31.3.2021 వరకు .. రెండు సంవత్సరాలు కాలంలో జరిగిన “ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ ” మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఈ ఏడాది నవంబర్ 8 వ తేదీ నుంచి నవంబరు 21 వరకు అధికారులచే క్షేత్ర స్థాయిలో ఆయా పనులపై సామాజిక తనిఖీ లు నిర్వహించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ, పధకం, గృహనిర్మాణం, ఆర్ డబ్ల్యూఎస్, సర్వశిక్షా అభియాన్, వెలుగు, పశుసంవర్ధక శాఖల సామాజిక తనిఖీలో గుర్తించిన అంశాలపై కాకర్ల సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో ప్రజా వేదికను నిర్వహిస్తున్నా మన్నారు. స్థానిక ఎమ్ పి డి ఓ కార్యాలయం ఆవరణలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగదాంబ పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొనవాల్సినదిగా సంబంధించిన శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సమాచారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *