Breaking News

జర్నలిస్టులు రోడ్డున పడితే… రాజ్యాంగం రోడ్డున పడినట్లే…

-జర్నలిస్టుల నిరసన దీక్షలో నేతల మద్దతు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీయూడబ్య్లూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి వి.కె. ఎం. తిలక్ ప్రారంభించారు. అతిధులుగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్ పాల్గొన్నారు. అర్బన్ అధ్యక్షులు చావారవి, రూరల్ అధ్యక్షులు వెంకట్రావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జర్నలిస్టుల నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరై తమ మద్దతును ప్రకటించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో
ప్రభుత్వం విఫలం : ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు

కరోనా తో చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లిస్తామని జీవో ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా నేటికి అమలు జరగకపోవడం విచారకరమన్నారు. అక్రిడేషన్ కార్డ్స్ విషయంలో కూడా జర్నలిస్టుల ను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదన్నారు. చిన్న పత్రికల విషయంలో కూడ అక్రిడేషన్స్ నేటికి సరైన నిర్ణయం తీసుకోపోవడం అత్యంత దారుణమన్నారు. అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీ నేటికి అమలు కాలేదన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఏపీ సచివాలయంలో మెదటిసారిగా బాధ్యతలు తీసుకున్న రోజు పెట్టిన సంతకం జర్నలిస్టుల ప్రమాద భీమా నేటికి అమలుకి నోచుకోలేదని మరోసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు యూనియన్ నాయకులు లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
వి ఉమామహేశ్వరరావు

జర్నలిస్టులు రోడ్డున పడితే రాజ్యాంగం రోడ్డున పడినట్లేనని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను విస్మరించడం బాధాకరమన్నారు.కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల కృషి అమోఘమన్నారు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటానికి తమ పూర్తి మద్దతును ఆయన ప్రకటించారు.

జర్నలిస్టులు చేయని ఉద్యమం లేదు
సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ

జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయని ఉద్యమం అంటూ లేదని సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఎలాంటి ఉద్యమం చేసినా ప్రభుత్వంలో కదలిక రాకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎవరు కలిసినా కలవక పోయినా సీఎంని ప్రతిరోజూ కలిసే వ్యక్తి జర్నలిస్టు సజ్జల ఒక్కరేనని స్వతహాగా జర్నలిస్టు అయిన సజ్జల ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లకపోవడం శోచనీయం అన్నారు. పత్రికలకు అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చే విషయంలో కూడా వివక్షత ప్రదర్శించడం ఈ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు.

ప్రభుత్వం విఫలమైంది..
బీజేపీనేత సోము వీర్రాజు

జర్నలిస్టుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతుందో అర్థం కావడం లేదని రాష్ట్ర జీజేపీనేత సోము వీర్రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంతో విలువతో కూడిన జర్నలిజాన్ని తన స్వలాభం కోసం అణిచివేయడం సీఎం జగన్ కు తగదన్నారు. ప్రస్తుత జర్నలిజంలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. జర్నలిస్టులు అడిగే న్యాయమైన ఆర్థిక సాయం ఒక్కరోజు ఈ ప్రభుత్వం పత్రికా ప్రకటన ఖర్చు ఉండదన్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసి కూడా సాయాన్ని నిలిపివేయడం దారుణమన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే జీవోలకు విలువలేదా అని ప్రశ్నించారు. న్యాయమైన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల పోరాటానికి టీడీపీ మద్దతు
-ఎమ్మెల్యే గద్దె రామమోహన రావు

కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు చేసిన కృషి అభినందనీయం. ఆ నేపధ్యంలోనే తమ ప్రాణాలు కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా జీవో జారీ చేసిన ఆర్ధిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాను అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3000 ఇస్తాను, ఇళ్ళు ఇస్తానని శుష్క వాగ్దానాలు చేసి ఇప్పటికి రెండున్నర ఏళ్ళు పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి నేడు ప్రభుత్వం లో కీలకపాత్ర పోషిస్తున్నారని కానీ ఆయన కూడా స్పందించకపోవడం శోచనీయమన్నారు. జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే టీడీపీ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
అదే విధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీడీపీ అధినేత చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని తెలియజేశారు.

కాంగ్రెస్ పూర్తి మద్దతు
-నరహరశెట్టి నరసింహారావు

జర్నలిజం అనేది కత్తిమీద సాము లాంటిదని అటువంటి వృత్తిని చేపట్టి ప్రజలకు సేవచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. గతంలో జర్నలిస్టులకు సిఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస వేతనాలు కూడా లేకుండా సేవ చేసేది ఒక్క జర్నలిస్టులేనని ఆయన తెలియజేశారు. అందువల్ల వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉందన్నారు.

ఇస్తానన్న సాయం ఎప్పుడు ఇస్తారు
పోతిన మహేష్
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వం జారీ చేసిన జి ఓ ప్రకారం 5లక్షల పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో తక్షణమే స్పష్టం చేయాలన్నారు.
సకల శాఖల మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కరించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. అక్రిడిటేషన్ కార్డులు జారీలో కూడా జాప్యం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. కనీసం జర్నలిస్టులకు గృహాలను జె ఎన్ ఎం యూ ఆర్ లో నైనా ఇవ్వాలన్నారు. ప్రస్తుతం జగన్ కోసం పనిచేస్తేనే సమస్యలు పరిష్కారం చేస్తామన్న చందంగా జర్నలిజం తయారైందన్నారు. కానీ జర్నలిస్టులు జనం కోసం పని చేస్తున్నారు కాబట్టి పరిష్కారం అవుతుందనే నమ్మకంలేదని తెలిపారు. ముఖ్యంగా
చిన్న పత్రికల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాను జర్నలిస్టుల సమస్యలను పార్టీ అధినేత పవన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నారు.

ఇంకా రైతు సంఘం నేత తులసీరావు, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎం ఆర్ పీఎస్ నేత పేరుపోగు వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, టీడీపీ నాయకులు జాస్తి సాంబశివరావు,గన్నె వెంకట నారాయణ ప్రసాద్(అన్న), ఢీ పత్రిక ఎడిటర్ బాల కోటయ్య, తమ మద్దతును ప్రకటించిన వారిలో ఉన్నారు.

నిరసన దీక్షలో…

నిసరన దీక్షలో అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఫోటోగ్రఫార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, సీనియర్ జర్నలిస్టు షేక్ బాబు, జి రామారావు ఏపీయూడబ్య్లూజే రూరల్ నేతలు ప్రసాద్, మోజెస్, సేన శ్రీనివాసరావు, దాసరి నాగరాజు, జనజ్వాల శ్రీనివాసరావు, పి సురేంద్ర కుమార్, జి రఘురాం, మురళీకృష్ణ, వై శాంతి, జి.శ్రీనివాసకుమార్, ఎం హెచ్ చక్రవర్తి, ఎంవీ సుబ్బారావు, బీవీ శ్రీనివాసరావు, సయ్యద్ హుస్సేన్, ఆర్ శ్రీనివాసరావు, ఏ సురేష్ కుమార్, సహిస్తా ఖానూమ్ పఠాన్, టి. శివరామకృష్ణ, తిరుమలరావు, ఆర్ వసంత్ , గంగరాజు, తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *