Breaking News

ముదినేపల్లి మండలం వడాలి ఆర్బికె లో ఉన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ జె.నివాస్..

-జిల్లాలో 734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు …
-తాసిల్దార్ రైస్ మిల్లర్లు తో సమావేశం నిర్వహించి గన్ని బ్యాగ్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి..
-రైతులు సొంత ట్రాన్స్ పోర్ట్ ద్వారా ధాన్యం బస్తాలు తీసుకువస్తే వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను అందించాలి..
-నిపుణులైన డేటా కంప్యూటర్ ఆపరేటర్లు ను దాన్ని కొనుగోలు కేంద్రాల్లో పక్కగా నియమించాలి.
-ఎటువంటి అవకతవకలు జరిగిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
-కలెక్టరు జె. నివాస్

ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం 734 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శుక్రవారం ముదినేపల్లి మండలం వడాలి ఆర్బికే కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ జె.నివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూర్పిళ్లు ప్రారంభించబడిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైందన్నారు. ఇప్పటికే 232 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నూర్పిళ్లు ప్రారంభం కాని ప్రాంతాల్లో నూర్పిళ్లు మొదలవగానే ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎటువంటి అపోహలు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకుని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందవచ్చునన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 2.10 కోట్ల గోనె సంచులను సిద్ధం చేస్తున్నమన్నారు. ఇప్పటికే 80 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యవసాయ ప్రాధమిక సహకార సోసైటీల ఆధ్వర్యంలో 517, డిసియంఎస్ ఆధ్వర్యంలో 121, మార్కెంటింగ్ ఆధ్వర్యంలో 96 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించబడతాయన్నారు. ధాన్యం కొనుగోలు చేసే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో తేమ శాతం కొలిచే యంత్రాలను, ఎలక్ట్రానిక్ కాటాలను సిద్ధం చేశామన్నారు. 734 మంది టెక్నికల్ అసిస్టెంట్లను, 500 మంది డిఇవోలను, 1580 మంది సహాయకులను ధాన్యం కొనుగోలుకు సిద్ధం చేశామన్నారు. ధాన్యం కొనుగోలును పారదర్శకంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు సర్వ సన్నదంగా ఉన్నామన్నారు. సిబ్బంది అందరికి అన్ని స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వడాలి ఆర్బికె కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన తేమ కొలిచే యంత్రం ద్వారా ధాన్యం తేమ కొలిచే తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఆర్బికె పరిధిలో నుండి ఎంత ధాన్యం వస్తోందో అంచనా వేసుకోవాలన్నారు. తాసిల్దార్ రైస్ మిల్లర్లుతో సమావేశం నిర్వహించి గన్ని బ్యాగ్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు సొంత ట్రాన్స్ పోర్ట్ ద్వారా ధాన్యం బస్తాలు తీసుకు వస్తే వారికి ట్రాన్స్పోర్ట్ మరియు హామీలీ ఛార్జీలను ప్రభుత్వమే అందించాలన్నారు. నిపుణులైన డేటా కంప్యూటర్ ఆపరేటర్లు ను దాన్ని కొనుగోలు కేంద్రాల్లో పక్కగా నియమించాలన్నారు. ఎటువంటి అవకతవకలు జరిగిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు జె. నివాస్ అధికారులను హెచ్చరించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏ గ్రేడ్ రకం 100 కేజిలు 1960 రూపాయలు, 75 కేజిలు 1470 రూపాయలకు, సాధారణ రకం ధాన్యం 100 కేజిలు 1940 రూపాయలు, 75 కేజిలు 1455 రూపాయలు, చొప్పున కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు చేసే ధాన్యం నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలన్నారు. ధాన్యంలో తేమ 17 శాతం వరకు ఉండవచ్చునన్నారు. ఈ – క్రాప్ నమోదు చేసుకున్నదాని ఆధారంగా ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. అవసరమైన గోనె సంచులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
కలెక్టర్ ఆర్డీవో శ్రీనుకుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రవికుమార్ తహాశీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు, ఆర్బీకే సిబ్బంది, గ్రామ సర్పంచ్ మరీదు దుర్గశ్రీ, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *