కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య కరమైన సమస్యలతో డాక్టర్ల వద్దకు, వ్యక్తిగత సమస్యలతో మా వద్దకు ప్రజలు వస్తారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కొవ్వూరు ఏరియా ఆస్పత్రి లో బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంనకు మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు కోసం వొచ్చే వారితో ఆప్యాయంగా పలకరించి ఏమి కాదనే భరోసా ఇవ్వవలసిఉందన్నారు. నిబద్ధతతో మన విధులకు న్యాయం చేయాలని కోరారు. మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, డాక్టర్ల ను ప్రత్యక్ష దైవం గా ప్రజలు భావిస్తారని, ఇది గౌరవ ప్రధమైన వృత్తి అన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు కావలసిన మౌలిక వసతుల కోసం రూపొందించి అంశాలతో, ఆసుపత్రి అభివృద్ధి కి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. ఆసుపత్రికి కావలసిన పోస్టు మార్టం రూమ్ చదలు సమస్య, విద్యుత్ సరఫరా వైరింగ్, లెబర్ రూమ్, ఆపరేషన్ దియటర్, ఫైర్ ఎన్ఓసి, ఎక్స్రరే మిషన్ లో సాఫ్ట్వేర్, బ్యాటరీలు, అంబులెన్స్ రిపేర్లు, సానిటరి తదితర11 అంశాలపై చర్చించి, సమావేశంలో ఆమోదం తెలిపారు. సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా ఆసుపత్రి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డివిఎస్ రామారావు, ఎస్వీయస్ఆర్కే నాగభూషణ శాస్త్రి, సివిల్ సర్జన్ డా.కె. కొటేశ్వరి, ఎమ్. భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ పి. జగదాంబ , డాక్టర్ల, ఆసుపత్రి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …