-కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పర్యటనలో భాగంగా కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ బుడమేరు వంతెన పై పాడైన రైలింగ్ మరియు పాదచారులు నడిచే పుట్ పాత్ లకు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో ఏలూరు కాలువ అంచున అల్లూరి సీతారామరాజు పార్క్ వరకు కెనాల్ బండ్ వెంబడి గల చెత్త మరియు వ్యర్ధములను తొలగించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మరియు రోడ్ నందలి ప్యాచ్ వర్క్స పనులు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాంబె కాలనీ హెచ్ బ్లాక్ వద్ద గల ఖాళి స్థలము చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించిన దర్మిల అక్కడ పార్క్ గా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా సంగీత కళాశాల రోడ్ నందు చేపట్ట వలసిన ప్యాచ్ వర్క్ పనులను అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు చేస్తూ, పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాల సందర్శన…
సింగ్ నగర్ ప్రాంతములోని 252,253,254 వార్డ్ సచివాలయాలను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క పని విధానము మరియు హాజరు ను పరిశీలించారు. వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీం (OTS) పై ప్రజలకు సమగ్ర అవగహన కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బంది తో పాటుగా సచివాలయాలలో పని చేయు వారు లబ్దిదారులకు వివరించాలని అన్నారు.
Prajavartha Online Telugu News