Breaking News

సందర్శకులతో కిటకిటలాడిన నోవాటెల్…

-మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణను కలిసేందుకు విచ్చేసిన సందర్శకులతో శనివారం నోవాటెల్ కిటకిటలాడింది. శనివారం ఉదయం కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న అనంతరం హోటల్ కు చేరుకున్న జస్టిస్ ఎన్. వి. రమణ కలిసేందుకు సందర్శకులు భారీ ఎత్తున హోటల్ కు చేరుకున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని జస్టిస్ వెంకటరమణ ఆప్యాయంగా పలకరించారు. ముందుగా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోవాటెల్ లో శనివారం మర్యాపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. రహదారులు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ జె.నివాస్,పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామి, పర్యావరణవేత్త ప్రొఫెసర్ అజయ్ కాట్రగడ్డ, ప్రముఖులు మండలి బుద్ధ ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మర్యాపూర్వకంగా కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *