Breaking News

విజయవాడ నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోక రక్షకుడు యేసయ్య కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా ఉన్నతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఏసయ్యని ప్రార్థిస్తున్నానని నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తెలియజేశారు. 55 వ డివిజన్ లో CSI చర్చి, వించిపేట నందు సోమీ. గోవింద్, డాక్టర్ శ్రీనివాస్ మరియు నూనె సోమశేఖరు ఆధ్వర్యంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. CSI చర్చి పాస్టర్ కరుణానిధి గారిచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని 200 మంది మహిళలకు చీరలను బహుకరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ క్రైస్తవo అంటే ఒక మతం కాదని సన్మార్గంలో నడిచే ఒక జీవన విధానమని, ఏసుక్రీస్తు చూపిన మంచిమార్గమని, ఆ మార్గాన్ని అనుసరిస్తూ అందరూ మంచి నడవడిక కలిగి ఉండాలని, దేవునికి దగ్గరవ్వాలంటే పాపం చెయ్యకూడదని పాపం చేస్తే దేవునికి మనకు దూరం పెరుగుతుందని, తెలియని అగాధం ఏర్పడుతుందని, క్రీస్తు దీవెనలతో అందరు సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను అని, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిళ్ళా శ్రీను, పోతిన సాంబా, అమన్, సిటీ కమిటీ సభ్యులు మోబిన, ఆకారపు విజయ కుమారి, కొర్ర గంజి వెంకటరమణ,s నరేష్, వెన్న శివ శంకర్, గరే మురళి, రెడ్డిపల్లి గంగాధర్,  బిసి విజయవాడ మహిళా అధ్యక్షురాలు జ్యోతి, ఝాన్సీ, పిళ్ళా రవి అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు పుల్లారావు, బుద్ధన ప్రసాద్, మూర్తి, సోమీ మహేష్ , బావి శెట్టి శ్రీను,నూకరాజు తదితరులు పాల్గొన్నారు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *