Breaking News

స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం… .

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పరిష్కారాన్ని వీలుకాని దరఖాస్తులను అందుకు గలా కారణాలను ధరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెలిజజేయలన్నారు. తెలియజేస్తూ స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, ఇరిగేషన్ ఈ.ఈ., కె.ఎల్.ఎన్. ప్రశాంతి, పంచాయతీరాజ్ అధికారి ఎం. బసవయ్య, డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసరు కె. భాస్కరరావు, అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ అధికారి ఏ .దివ్య, హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. రత్నమాల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *