Breaking News

జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించిన లబ్దిదారులు బృందాలు గా ఏర్పడి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించిన లబ్దిదారులు బృందాలు గా ఏర్పడి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పేర్కొన్నారు.

పెనుమంట్ర మండలం లో మరో ఎనిమిది లే అవుట్లలో 355 మంది లబ్దిదారులకి ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా స్థలాలు అందించామని , వారిలో 222 మంది ఇంటి నిర్మాణాలను ప్రారంచారన్నారు. మిగిలిన లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇంటి నిర్మాణాలని ప్రారంభించాలని కోరారు.

గురువారం పెనుమంట్ర మండలం లో గరువు, జుత్తిగ, సత్తా రామేశ్వరం, పోలమూరు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి మంత్రి లే అవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు చేసుకునే లబ్దిదారులకి ఎటువంటి అవాంతరాలు లేకుండా ట్యాంక్ లు ద్వారా నీరు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాబోయే రెండు నెలల్లో కాలనీల్లో రహదారులు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. త్రాగునీటి టాప్ కనెక్షన్స్ కోసం పైపు లైన్స్ ఏర్పాటు జరుగుతున్న దని, లబ్ధిదారులు ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసే నాటికి కుళాయి కనెక్షన్, కాలనీల్లో విద్యుత్తు , వంటి ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నాలుగు దశల్లో ఇంటి నిర్మాణం చేపట్ట వొచ్చని, స్వంతంగా ఇళ్ళు కట్టుకునే వారికి బేస్మెంట్ కోసం డ్వాక్రా సంఘాల కి రూ.35 వేలు రుణం అందిస్తున్నామని, అమొత్తం పెట్టుబడిగా వివిధ దశల్లో పనులు చేపట్టాలని, ఆయా పనులు పూర్తి చేసిన వెంటనే డబ్బులు లబ్దిదారుల ఖాతాకు జమ చేస్తామన్నారు. పోలమూరు, నత్తరామేశ్వరం, గరువు, జుత్తిగ లోని లబ్దిదారులు కలిసి గ్రూప్ గా ఏర్పడి సామూహికంగా ఇళ్ల నిర్మాణం చెప్పట్టాలని మంత్రి సూచించారు. ఈ నాలుగు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం కోసం రూ. 28 లక్షలు 78 వేలు విడుదల చేసామని, నిర్మాణం కోసం లబ్దిదారులచే ఖర్చు చేసిన కి రూ. 20 లక్షల 40 వేలు నగదు చెల్లింపులు చేసామని, మెటీరియల్స్ కోసం మరో రూ.7 లక్షలు 37 వేలు ఖర్చు చేసినట్లుగా ఆయన తెలిపారు. పేదలందరికి ఇల్లు పధకం విజయ వంతం కావడంలో ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. కోట్లు ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేసి లబ్దిదారులకి ఉచితంగా స్థలాలు ఇస్తే , ఇంటి నిర్మాణాలు చేసుకోవడానికి ముందుకు రాకుండా ఉంటే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. పేదవానికి స్వంత ఇంటి కల సాకారం చేసేందుకు కలిసి రావాలని , ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా ఉండాలని కోరారు.

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి స్వంత ఇల్లు కల్పించే దిశగా కోట్లాది రూపాయలను చెల్లించి భూముల ను కొనుగోలు చేసి పేద లకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. అదే కాకుండా సంబంధించిన లే అవుట్లలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళికలు తయారు చేయడం జరుగుతోందన్నారు. ఈ రోజు పెనుమంట్ర మండలం లోని గురువారం 4 గ్రామాల్లో 8 లే అవుట్ల లో జరుగుతున్న ఇళ్ళ నిర్మాణాలని మంత్రి పరిశీలించారు.పెనుమంట్ర మండలం లో ఇప్పటికే 1672 మంది లబ్దిదారులు ఇళ్ల నిర్మాణా లు ప్రారంభించారన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం రూ. 1 కోటి 76 లక్షలు 47 వేలు విడుదల చేసారని, నిర్మాణం కోసం లబ్దిదారులచే ఖర్చు చేసిన కి రూ. 1 కోటి 31 లక్షల 68 వేలు చెల్లింపులు చేసామని, మెటీరియల్స్ కోసం మరో రూ.44 లక్షలు 79 వేలు ఖర్చు చేసినట్లుగా ఆయన తెలిపారు.

ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వివిధ దశల్లో చేపడుతున్న నిర్మాణాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని మంత్రి శ్రీరంగనాధ్ రాజు సూచించారు. ఇళ్ల నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టి, ప్రణాళికలు మేరకు పూర్తి చెయ్యాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి( వాసు), జెడ్పిటిసి కర్రి గౌరీ సుభాషిని, సర్పంచ్ లు ఎంపీటీసీలు, నాయకులు లబ్ధిదారులు, ఎంపీడీవో రాంబాబు, తాసిల్దార్ దుర్గా కిషోర్, హౌసింగ్ డీఈ, ఆర్డబ్ల్యూఎస్ డిఈ,హౌసింగ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఎలక్ట్రికల్ ఏఈ, వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *