Breaking News

సంక్రాంతి పండుగ సందర్భంగా పందేలు, చట్టవ్యతిరేక క్రీడలపై నిషేధం

-ఉల్లంఘించిన వారిపై జంతువులపై క్రూరత్వం చట్టం. 1960 , ఏపీ గేమింగ్ యాక్ట్, 1974కేసులు నమోదు..
-తహసీల్దార్ నాగరాజు నాయక్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలములో జనవరి -2022 నెలలో జరగబోవు సంక్రాంతి పండుగకు నిర్వహించు కోడి పందెములు , గుండాట , క్లబ్ నిర్వహించుట , పేకాట , కోతాట , లోన – బయట వంటి చర్యలు, రైతుల సొంత భూమిలో కోడి పందెములు నిర్వహించుటకు ఆట స్థలము ( బరి ) ఏర్పాటు చేయుట చట్టరీత్యా నేరంగా పరిగణించడం జరుగుతోందని తహశీల్దార్ బి.నాగరాజు నాయక్ పేర్కొన్నారు.

గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పోలీసు, సంబంధించిన శాఖల అధికారులతో, సచివాలయ కార్యదర్సులు, వాలంటీర్లు తో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వులు , జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులు ప్రకారము కొవ్వూరు మండలములో జనవరి -2022 నెలలో జరగబోవు సంక్రాంతి పండుగకు నిర్వహించు కోడి పందెములు , గుండాట , క్లబ్ నిర్వహించుట పై నిషేధం అమలులో ఉందన్నారు. మండలం పరిధిలో పేకాట , కోతాట , లోన – బయట వంటి చర్యలు మరియు రైతుల సొంత భూమిలో కోడి పందెములు నిర్వహించుటకు ఆట స్థలము ( బరి ) ఏర్పాటు చేయుట, ప్రవేటు, ప్రభుత్వ భూములలో కోడి పందెములు గాని మరి ఏ ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిపిన యెడల Cruelty to Animal Act. 1960 and A.P. Gaming Act, 1974 చట్ట ప్రకారము శిక్షకు పాత్రులగుదురని తహశీల్దార్ హెచ్చరించారు. సెక్షన్ 144 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉత్తర్వులు అమలులో ఉన్నందున పై తెలిపిన చట్ట వ్యతిరేఖ కార్యక్రమములు గానీ, ప్రజలకు శాంతి భద్రతలకు ఆటంకము కల్గించరాదని ఆయన తెలియపరిచారు. సదరు పై తెలిపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మండలములో ఎక్కడయినా నిర్వహించుట , నిర్వహించుట కు ప్రయత్నంచిన యెడల సదరు సమాచారము వెంటనే కొవ్వూరు మండలములో గల గ్రామ రెవెన్యూ అధికారి , గ్రామ కార్యదర్శి మరియు కొవ్వూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్, రూరల్ మరియు అర్బన్ వారికి తెలియపర్చ వలసినదిగా ప్రజలను కోరుతున్నట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *