Breaking News

చిన్నారుల కోసం లైంగికనేరాల చట్టం-2012 (పోక్సో) అమలు…

కర్టెన్ రైజర్ స్టోరీ…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంలో శుక్రవారం అధునాతన సౌకర్యాలతో, మహిళలకు, పిల్లలకు పూర్తి వసతులు కల్పిస్తూ నిర్మించిన పోక్సో కోర్టు, ఇతర కోర్టు భవన సముదాయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి , జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ ఆసనుద్దీన్ అమానుల్లా, హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ బట్టు దేవానంద్ లు దృశ్య మాధ్యమం విధానంలో 21 వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభించడం ఎంతో హర్షణీయం. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు గురించి పలుమార్లు ప్రస్తావించడం విశేషం.
2019 లో లైంగికనేరాల చట్టం-2012 (పోక్సో) అమలు చేసే ప్రత్యేక కోర్టు కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం నుంచి విజయవాడకు మార్చబడింది. రెండేళ్ల తర్వాత తిరిగి మచిలీపట్నం ఏర్పాటుచేయాలనీ ఉన్నతస్థాయి ఆదేశాలు జారీ కావడం గొప్ప శుభ పరిణామం. పోక్సో కోర్టు తిరిగి తన స్వస్థలానికి రావడంలో కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాకకృష్ణ విశేష కృషి, పట్టుదల ప్రధాన భూమిక పోషించాయి.
2019 జూలై 1న ‘ బచన్ బచావో ఆందోళన్ ‘ సీఈవో సమీర్ మాథుర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్. బి.వినోద్ కుమార్ సమావేశమై పోక్సో ప్రత్యేక కోర్టు నిర్మాణం అవసరంపై సమాలోచనలు జరిపారు. పోక్సో చట్టం కింద కేసులను త్వరతగతిన పరిష్కరించే ‘ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్స్’ ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. ఈ క్రమంలోనే లైంగికనేరాల చట్టం-2012 (పోక్సో) అమలుతో బాధితులైన పిల్లలకు భరోసా ఇచ్చేవిధంగా ప్రత్యేక కోర్టులను దేశంలో పలుచోట్ల ఏర్పాటు చేయడం అభినందనీయం.
అత్యంత హేయమైన నేరాల్లో ఒకటి పిల్లలపై లైంగిక వేధింపులు. ఈ నేరాలు సమాజంపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. రాష్ట్రాల వారీగా ‘పోక్సో చట్టం-2018’ కింద నమోదవుతున్న నేరారోపణల రేటు చూస్తే 100 శాతం ఛండీగఢ్, మణిపూర్ు అగ్రస్థానంలో ఉంది. జాతీయ నేర రికార్డు బ్యూరో వారి 2020 సమాచారం ప్రకారం పోక్సో చట్టం కింద తెలుగురాష్ట్రాలలో రిజిష్టర్ అయిన కేసుల సంఖ్య 2,074, రాష్ట్రంలో పిల్లలపై జరిగిన లైంగికదాడుల సంఖ్య 1,415, ఈ సమాచారం ద్వారా గత కొన్నేండ్లుగా దేశంలో లైంగికనేరాలు వేగంగా పెరుగుతున్నాయని గణాంకాలు ధృవీకరిస్తున్నాయి.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ సహకారంతో ఈ కోర్టులో బాలల కోసం ఏర్పాటుచేసిన వసతుల్లో క్రెష్ చిన్నారుల సంరక్షణ కేంద్రం), పాలిచ్చే తల్లుల కోసం, చిన్నారుల డైపర్లు మార్చుకునేందుకు విడిగా క్యాబిన్లు ఉంటాయి. దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీ, ప్రథమ చికిత్సా కేంద్రం లాంటివి అందుబాటులో ఉండనున్నాయి. పిల్లల రక్షణకు, వారు ముద్దాయిలకు కనబడకుండా ఒకవైపే కనిపించే అద్దాలు, నేరస్థులు కోర్టు లోపలికి రావడానికి ప్రత్యేక మార్గం లాంటివి ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు పిల్లల మనసులకు సాంత్వన కలిగించేవిధంగా ఫ్యామిలీ కోర్ట్ సముదాయానికి, వేచి ఉండే హాలు తదితర ఆహ్లాదకరమైన నిర్మాణాలు జరగనున్నాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, పచ్చిక మైదానం లాంటివి కూడా ఏర్పాటు చేయనున్నారు.
బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టుల్లో పెండింగు కేసుల సంఖ్యను తగ్గించబడి, పటిష్ట పరిశోధన ద్వారా నేర నిరూపణ చేస్తూ పేద, అణగారిన వర్గాల బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించనున్నారు. పోక్సో చట్టం ద్వారా త్వరతగతిన ప్రతి కేసు పరిష్కరించేందుకు కావలసిన అన్ని సదుపాయాలు మచిలీపట్నం పోక్సో కోర్టు సముదాయం కలిగి ఉన్నది. ఈ కోర్టు విభాగంలో నియమించిన సిబ్బంది విధానపరమైన నైపుణ్యం కలిగి ఉంటారు. బాధిత స్త్రీల, బాలల స్థితిని, బాధను అర్ధం చేసుకునే విధంగా శిక్షణ తో బాధితులకు సేవలందిస్తూ ఉన్నత ఆశయాలను, కలలను సాకారం చేసే దిశలో నడుస్తుందని ఆశిద్దాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *