Breaking News

శరవేగంగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు… : జెసి డా.కె. మాధవిలత

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇప్పటికే 70 శాతం పైగా ధాన్యం కొనుగోళ్లు జరిపామని మిగిలిన 30 శాతం కొనుగోళ్లు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపాలని జాయింట్‌ కలెక్టర్‌ డా.కె. మాధవిలత అధికారులను కోరారు. నగరంలోని జెసి క్యాంప్‌ కార్యాలయం నుండి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ మాధవిలత పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీిజన్‌లో 8లక్షల 40 వేల మెట్రిక్‌టన్నుల ధాన్య కొనుగోళ్లు లక్ష్యం కాగా నేటివరకు 6.821 మంది రైతుల నుండి 5,45,940 మెట్రిక్‌టన్నులు ధాన్యాన్ని రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరిపి 1067.89 కోట్ల రూపాయలను వారి ఖాతాలోకి జమ చేశామన్నారు. నగదు చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా సకాలంలోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. కొనుగోలు జరిపెందుకు రైతు భరోసాకేంద్రాలకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ సహాయ వ్యవసాయ అధికారి, వ్యవసాయ శాఖ అధికారులు చూడాలన్నారు. దళారీల బారిన పడకుండా రైతులు రైతుభరోసా కేంద్రాల్లోనే కొనుగోలు జరిపేలా అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ మాధవిలత సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ డా. ఏ.శ్రీథర్‌ తదిరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రైవేట్ బస్సుల తనిఖీలు-అధిక చార్జీ వసూలు చేసే బస్సులపై చట్టపరమైన చర్యలు

-జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *