విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మాహుతి దినం సందర్భంగా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం,వాసవి సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం (కొత్త గుళ్ల) లో కుంకుమ పూజా మరియు చీరల పంపిని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథి పాల్గొని అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఒక పేద మహిళకు వెలంపల్లి ఫౌండేషన్ తరుపున ఒక తోపుడు బండి ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మవారు లోక కల్యాణార్థం అత్మహుతి పొందారు అని అటువంటి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రప్రజలందరికీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన మెండుగా వుండాలని ప్రార్దించారు.ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, శేగు వెంకటేశ్వరరావు,పొకూరి రమేష్,మిత్తింటి శారద, అనంతల ఇందిరా మరియు దేవస్థానం అధ్యక్షులు నందిపాటి శంకరావు, గొల్లపూడి శివకుమార్ తదితర కమిటీ సభ్యులు మహిళా నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …