విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లో నక్షత్ర సినీ రాక్ స్టార్స్ మెగా ఈవెంట్స్ కార్యాలయం గాంధీ నగర్ లో ఈ ఆదివారం ప్రారంభ మయింది నూతనంగా ఏర్పాటైన కార్యాలయాన్ని సంస్థ డైరెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యం లో బ్లూ బెల్ ఆర్కెస్త్ర అధినేత శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు.పలువురు కళారంగం,ఆర్కెస్ట్రా సంస్థ అధినేతలు వ్యాఖ్యాతలు సీనియర్ గాయనీ గాయకులు పాల్గొని సంస్థ అధినేత వలపర్ల సురేష్ ను అభినందించారు. పూజ కార్యక్రమాలను మధుమోహన్ గాయని మని రూపశ్రీ దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలకు హాజరైన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ గాయని గాయకులు ప్రోత్సాహించే విధంగా సంస్థను ప్రారంభించినందుకు సురేష్ కు అభినందనలు తెలిపారు.సీనియర్ గాయని గాయకులకు సినీ సంగీత విభావారిలు ఏర్పాటు చేసేందుకు సంస్థను స్తాపించడం హర్షణీయమన్నారు.సంస్థకు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు.సంస్థ అధినేత వలపర్ల సురేష్ మాట్లాడుతు సినీ సంగీత విభావారి ఏర్పాటు చేసి సీనియర్ గాయని గాయకులతో పాటు జూనియర్స్ కి కూడా అవకాశం కలిపిస్తామన్నారు.అంతే కాకుండా నూతన గాయనీ గాయకులకు సంగీతంలో మెళకువలు నేర్పించి వారి లోని నైపుణ్యం న్నీ పెంపొందించడానికి కృషి చేస్తానని అన్నారు. గాయని గాయకులు సంగీతంలో శిక్షన పొందేందుకు తమను సంప్రదించ వచ్చని మా ఫోన్ నెంబర్ 8125362999. ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ఆడియో అధినేత చావా నరసింహరావు,మయూరి ఆర్కెస్త్ర అధినేత సీనియర్ గాయకులు మొహ్మద్ ఖాజా,సీనియర్ గాయకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్,వ్యాఖ్యాత సీనియర్ గాయకులు దేవిడ్ రాజు,సీనియర్ గాయనీ మని రూపా శ్రీ దంపతులు ,సయ్యద్ అలీ,సీనియర్ గాయకులు జయప్రభు,చింత కాయల చిట్టిబాబు,ప్రణవి మ్యూజికల్ కే రాజు,bsnl శ్రీనివాస్, విజయ శ్రీ సాంస్కృతిక సేవా సంస్థ అధినేత బండారు నరసింహా రావు,వాగ్దేవి సంస్థ కృష్ణ,గాయకులు,యాక్టర్ చలపతిరావు,శ్రీనివాస్ భరద్వాజ,బి వి ఆర్ ఆర్కెస్ట్రా,ప్యాడ్ సురేష్,గాయకులు మధుమోహన్,గౌస్,వర్మ,విఎంసి శ్రీను,త్రినాథ్ నాయుడు నాటక రంగ కళాకారులు పాల్గొన్నారు.సంస్థ ప్రారంభం సందర్భంగా పలువురు సీనియర్ గాయని గాయకులు పాడిన పాటలు వీనుల విందు కలిగించాయి.
Tags vijayawada
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …