విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 101 వ జయంతి వేడుకలను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సంజీవయ్య నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప వ్యక్తిని, ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేద ప్రజలకు పంచి మహోన్నతుడానీ, అవినీతి చేసిన వారి భరతం పట్టడానికి అవినీతి నిరోధక శాఖ రూపకర్తని, కేవలం ప్రజల సంక్షేమం కోసమే చివరి క్షణం వరకు ప్రాకులాడిన ఉన్నతమైన వ్యక్తిత్వం గల రాజకీయ నాయకులని, అందుకనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, దామోదరం సంజీవయ్య లాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శాలను పుణికిపుచ్చుకుని రాజకీయాలు చేస్తున్నారని, సంజీవయ్య స్ఫూర్తిని కొనసాగించాలని వారి ఇంటిని చారిత్రాత్మకంగా ఒక స్మారక చిహ్నంగా నిలబెట్టాలనే సంకల్పంతో కోటి రూపాయల విరాళం అందజేసినారని, సంజీవయ్య ఆశయాలు కేవలం పవన్ కళ్యాణ్ తో మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమి. మహేష్ బంగారు. నూకరాజు, కొరగంజి. రమణ,రెడీపల్లి, గంగాధర్, సయ్యద్ అబ్దుల్ నజీబ్, సాబింకర్ నరేష్, బావిశెట్టి ,శ్రీను, పోలిశెట్టి. శివ ,బూరెల శంకర్, రామిశెట్టి మురళి, పొట్నూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …