-పిడబ్ల్యూ గ్రౌండ్‌లో శరవేగంగా పనులు…
-నిధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్‌లో పెట్టాం…
-ఇప్పటికే వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేశాం…
-పన్నెండున్నర అడుగుల నమూనా స్టాట్యూ ఏర్పాటు చేశాం…
-మంత్రులు, శాసన సభ్యులు, ప్రజలు విగ్రహాన్ని పరిశీలించి చేసిన సలహాలు సూచనలు, అభిప్రాయాల మేరకు తుది కాంస్య విగ్రహ ఏర్పాటుకు చర్యలు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2023 ఏప్రిల్ 14 న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవానికి స్వరాజ్ మైదానంలో పనులు శ రవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.
స్థానిక స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్ట్ పనులను సోమవారం ప్రాజెక్టు మంత్రుల కమిటీ సభ్యులు సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యంమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రుల కమిటీి సభ్యులు పనులను పరిశీలించడం జరిగిందన్నారు. 2023 ఏప్రిల్ 14న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జన్మదినం నాటికి పెడస్ట్రియల్ పూర్తిచేసుకుని విగ్రహాన్ని ప్రారభించేలా పనులు వేగంవంతం చేసేలా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. నిధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్‌లో పెట్టామని పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగా పన్నెండున్నర అడుగుల నమూనా విగ్రహాన్ని ఉంచడం జరిగిందని ఈ సమూనాను రాష్ట్రానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రజలు పరిశీలించి వారి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని 125 అడుగుల తుది కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రానికి చెందిన ఏపీఐఐసీ, సాంఘిక సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2023 ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని ప్రారంభిస్తారన్నారు. త్రిబుల్ ఐటీ చెన్నై సంస్థ విగ్రహానికి సంబంధించిన డిజ్తెన్ రూపొందిస్తున్నారన్నారు.268 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇప్పటికే 100 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. డిజ్తెన్ రాగానే పనులు శరవేగంగా జరుగుతాయన్నారు. పనులకు అవసరమైన స్టీల్‌ను కూడా కాంట్రాక్టర్ సిద్దం చేశారని మంత్రి అన్నారు. అన్ని పనులు పూర్తి చేసి 2023 ఏప్రిల్14న ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ పై మంత్రి విశ్వరూప్ ప్రశంసలు..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాం, స్మృతివనం పనులు పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తీసుకుంటున్న చొరవను మంత్రి విశ్వరూప్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పనులు శరవేగంగా జరగడానికి కలెక్టర్ అధికారులు, కాంట్రాక్టర్‌తో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టు త్వరిగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 20 ఎకరాల స్వరాజ్ మైదానంలో ఇప్పటికే 36 కట్టడాలను పైగా తొలగించి ఏపిఐఐసికి అప్పగించారని మిగిలిన నాలుగు కట్టడాలు కూడా అప్పగించేందుకు కలెక్టర్ చూపుతున్న చొరవను మంత్రి పినిపే విశ్వరూప్ ప్రశంసించారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సరేష మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు నగర నడి బొడ్డున విజయవాడకు తలమానికంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని 2020 సంవత్సరంలో శంకుస్థాపన చేశారన్నారు. 268 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన ఈ స్మృతి వనానికి ఇప్పటికే వంద కోట్లరూపాయల నిధులను విడుదల చేశామన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేసి విగ్రహ శంకుస్థాపన జరిగేందుకు సిద్దం చేస్తున్నామన్నారు. రెండు వేల మందికి వీలుగా అడిటోరియం, 500 మంది వీక్షించేందుకు వీలుగా ఓపెన్ థియేటర్, మెడిటేషన్ హాల్ ఉంటాయన్నారు. స్మృతివనానికి సంబంధించిన పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. నిధులకుఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్‌లో పెట్టి ఇప్పటికే వంద కోట్లను విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వం మారుమూల ప్రదేశంలో కేటాయించి తూతూ మంత్రంగా పనులు చేసి దళితులకు ఇచ్చిన హామిని నిలబెట్టుకోలేకపోయింది అని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల ఆత్మ గౌరవాన్ని నిలిపేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతివనాన్ని తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 125 అడుగుల కాంస్య విగ్రహాం, అంబేద్కర్ స్మృతివనాన్ని చారితక్ర ప్రదేశంగా రూపొందిస్తున్నామన్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో చక్కటి ల్యాండ్ స్కేప్, వాకింగ్ ట్రాక్ ఉంటాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆదర్శాలను భావితరాలు గుర్తించుకునే విధంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపిఐఐసి జనరల్ మేనేజర్ డి శ్రీనివాస్‌రావు, ప్రాజెక్టు మేనేజర్ జె. కృష్ణ మోహన్, సాంఫీుక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.