-కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల పుర సేవా కేంద్రం (103 సెల్) ను కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ,ఏ.ఎస్ పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందిని ప్రజల నుండి వచ్చిన సేవా వినతుల గురించి వాటి పరిష్కామునకు తిసుకొనే చర్యల గురించి ప్రశ్నించినారు. ఈ సందర్భంలో పౌర సేవా కేంద్రం నందలి జననమరణ దృవీకరణ కౌంటర్ నందు సిబ్బందిని జననమరణ సమాచారము నిర్ణీత గడువులోపల హాస్పిటల్ నుండి వచ్చుచున్నాదా? లేదా? ఏమైనా సమస్యలు కలవా అని వాకబు చేసినారు. ధృవీకరణ పత్రముల కొరకు వచ్చు ప్రజలకు పూర్తి సమాచారము అoదచేయవలెనని విధి నిర్వహణ పట్ల బాధ్యతగా ఉండవలెను అని ప్రతి సేవకు సంబంధించిన పూర్తి సమాచారము పరిష్కారము మరియు జారీ కొరకు నిర్దేశించిన గడువు వివరములు తదితర విషయములపై పూర్తి అవహగాన కాలిగి ఉండవలెనని, ఆలస్య నమోదునకు సంబంధించి అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనల కాపీలను అందుబాటులో ఉంచుకొన వలెనని సిబ్బందిని ఆదేశిoచినారు. అదే విధంగా పుర సేవా కేంద్రములలో గల ఇతర కౌంటర్ల పనితీరును అడిగితెలుసుకోని సిబ్బంది సేవా దృక్పదంతో ప్రజలకు సేవ చేసేలా పని చేయాలని అన్నారు.