బలివే లో మహాశివరాత్రి కి పటిష్టమైన ఏర్పాట్లు : అధికార్లను ఆదేశించిన ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి సందర్భంగా ‘బలివే ‘ గ్రామంలో జరగనున్న ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ముసునూరు మండలం బలివే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరరా స్వామి వారి దేవాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి మార్చ్,2వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తుల హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీని అనుసరించి దర్శనానికి బారికేడ్ లు ఏర్పాటు చేయాలనీ, దర్శన సమయంలో ఎటువంటి తోపులాటలు లేకుండా, భక్తులు కోవిడ్ నిబంధలను సామాజిక దూరం పాటించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. . భక్తులు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజేర్ వినియోగించేలా చూడాలన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలనీ ఆర్ టి సి అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఉత్సవాల సమయంలో విద్యుత్తు సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను ఆర్డీఓ ఆదేశించారు.

సమావేశంలో ముసునూరు తహసీల్దార్ జోజి, ఆలయ ఎక్సిక్యూటివ్ అధికారి సి. జయప్రకాశ్ బాబు, అగ్నిమాపక అధికారి కె. భాస్కరరామం, సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాథ్, వైద్యాధికారి డా. అవినాష్, ఎస్.ఐ ఆరీఫ్, పంచాయత్ రాజ్ ఏ .ఈ. టి.వి నరసింహారావు, ఆర్టీసీ అధికారి యాకూబ్, ట్రాన్స్కో అధికారి హేమసుందర్ కుమార్, అటవీ, రెవిన్యూ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *