రమేష్‌ హాస్పిటల్స్‌లో అరుదైన జీర్ణకోశ వ్యాధికి అధునాతన వైద్యచికిత్స

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రమేష్‌ హాస్పిటల్స్‌ ప్రముఖ సీనియర్‌ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ బత్తిని రాజేష్‌ ఆధ్వర్యంలో ఆహారనాళం బిగుసుకుపోయి ఎటువంటి ఆహారాన్ని మింగలేకపోవటం (అక్లేసియా కార్డియా) అనే వ్యాధి బారినపడిన 37 మంది రోగులకు క్లిష్టమైన ఎండోస్కోపిక్‌ చికిత్స అయిన ‘పర్‌ ఓరల్‌ ఎండోస్కోపిక్‌ మయాటమి’ (పోయమ్‌) విధానం ద్వారా విజయవంతంగా రోగులకు చికిత్స నిర్వహించి సాంత్వన కలిగించారు.

ఈ సందర్భంగా డా॥ రాజేష్‌ మాట్లాడుతూ సాధారణంగా ఆహారనాళం ద్వారా ఆహారం పొట్టలోపలికి వెళుతుంది. ఈ అక్లేసియా కార్డియా వ్యాధిలో ఈ ప్రక్రియ జరగదు. తత్ఫలితంగా ఆహారం ఆహారనాళికా ఫీఠం వద్దనే చిక్కుకుపోవటం, తద్వారా గొంతులో తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తెలియజేసారు.

ఛాతీలో మండినట్లుండే భావం, మింగినప్పుడు ఆహారం గొంతుకు అడ్డుపడి ఊపిరాడని గడ్డు పరిస్థితి, మింగిన తర్వాత ఆహారాన్ని వాంతి చేసుకోవడం, గణనీయంగా బరువు కోల్పోవడం వంటి ప్రధాన లక్షణాలు ఈ వ్యాధిలో కనపడతాయి. సాధారణంగా అక్లేసియా కార్డియా లక్ష మంది ప్రజలలో ఒక్కరికి వస్తుందని, వైరల్‌ ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్‌ పరిస్థితులు మరియు వంశపారంపర్య కారణాల వలన ఈ వ్యాధి సంభవిస్తుందని దీనిని చికిత్స చేయకుండా వదిలేస్తే ఆహారనాళపు క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం కూడా ఉందని తెలియజేసారు. ఈ అధునాతన ఎండోస్కోపి చికిత్స నోటి ద్వారా చేయటం వలన ఎటువంటి కుట్లు లేకుండా రోగి త్వరగా కోలుకుంటారని ఈ విధానంలో ఇప్పటివరకు గుంటూరు, విజయవాడలో 37 పోయమ్‌ చికిత్సలు నిర్వహించామని విజయవాడలో మొట్టమొదటి సారిగా 5గురికి విజయవంతంగా ఈ చికిత్స నిర్వహించినట్లు డాక్టర్‌ రాజేష్‌ తెలియజేసారు.

ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఈఆర్‌సిపి, ఎండోస్కోపిక్‌ అల్ట్రాసౌండ్‌, పవర్‌ స్పైరల్‌ స్మాల్‌ బోవెల్‌ క్యాప్సూల్‌ ఎండోస్కోపి వంటి అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోనికి తీసుకొని వచ్చామని, రాష్ట్రంలో మొదటిసారిగా పోయమ్‌ చికిత్సలను ప్రారంభించి ఇప్పటి వరకు 37 మంది రోగులకు సాంత్వన కలిగించిన గ్యాస్ట్రోఎంట్రాలజి వైద్యబృందాన్ని ఈ సందర్భంగా రమేష్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రమేష్‌ బాబు అభినందించారు.

ఈ కార్యక్రమంలో రమేష్‌ హాస్పిటల్స్‌ ఎంజి రోడ్‌ శాఖ యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ కారుపాటి సుదర్శన్‌, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ తాతినేని సందీప్‌, ఫిజీషియన్‌ డాక్టర్‌ కాకాని సింధూర, ఎనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ పద్మజ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *