విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జి.కొండూరు మండలం వెల్లటూరు ఆయుష్ వైద్యశాలలో పార్ట్ టైం యోగా శిక్షకుల నియామకం కొరకు తమ డిస్పెన్సరీ పరిధిలోని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఆర్.లలిత ఓ ప్రకటనలో తెలిపారు. తమ ఆసుపత్రికి పురుష యోగా శిక్షకుని పోస్ట్ ఒకటి, మహిళా యోగా శిక్షకురాలు పోస్ట్ ఒకటి…మొత్తం రెండు పోస్టులు మంజూరయ్యాయని తెలిపారు. గంటకు రూ.250 లు చొప్పున గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. పురుష యోగ శిక్షణ కు నెలకు 32 గంటలు, మహిళా యోగా శిక్షణకు నెలకు 20 గంటలపాటు ఆసుపత్రిలో యోగా నేర్పించాలి ఉంటుందన్నారు. ఎమ్మెస్సీ (యోగ), డిప్లమా (యోగ)… విద్యార్హత లేకున్నా యోగాలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయబడుతుందన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఆసుపత్రి లో జరుగు వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
Tags vijayawada
Check Also
జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు
-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …