Breaking News

మైనారిటీల విద్యోన్నతి, అభ్యున్నతికి వై.సి.పి ప్రభుత్వం కృషి చేస్తుంది

-రాబోయే రోజుల్లో మరిన్ని ఉర్దూ కాలేజీలు అందుబాటులోకి తీసుకువస్తాం
-ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షులు మయాన జాకీయా ఖానమ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
45 వ డివిజన్ నందు రూ.230 లక్షల నాబార్డ్ నిధులు మరియు రూ.13.50 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ ఉర్దూ కళాశాలను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమములో ఎపి శాసన మండలి ఉపాధ్యక్షులు మయాన జాకీయా ఖానమ్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, యం.డి రుహల్లా, కమిషనర్ పి.రంజిత్ భాషా ఐ.ఎ.ఎస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,అవుతూ,శైలజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎపి శాసన మండలి ఉపాధ్యక్షులు మయాన జాకీయా ఖానమ్ మాట్లాడుతూ మైనారిటీల పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, మైనారిటీల విద్యోన్నతి కోసం ప్రభుత్వం ఉర్దూ అనేక కళాశాలలను నిర్మిస్తోందన్నారు. మైనార్టీల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉర్దూ కాలేజీలు నిర్మిం చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు.

కులమతాలకు అతీతంగా అభివృద్ధి, రాభోవు రోజులలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం
దేవాదాయ, ధర్మదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీ మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి చెదెందుకు కృషి చెస్తున్నామాన్నారు. ఏపీలో సీఎం జగన్ ఉర్దూ భాషను సెకండ్ లాంగ్వేజ్ గా చేశారని, కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. నగరంలో స్థానిక ప్రజల కోరిక మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ఉర్దూ జూనియర్ కళాశాలను నిర్మించామన్నారు.

పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఉర్దూ కళాశాల లేక అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ గారి కృషితో నగరపాలక సంస్థ స్థలంలో ద్వారా ఈ కళాశాల నిర్మాణ చేపట్టినట్లు, రూ.230 లక్షల నాబార్డ్ నిధులు భవన నిర్మాణం మరియు రూ.13.50 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణ చేపట్టుట జరిగిందని అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించుటతో పాటుగా విద్యార్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించుట జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్యతో పాటుగా పలువురు కార్పొరేటర్లు మరియు వివిధ కార్పోరేషన్ల చెర్మెన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు మరియు నగర పాలక సంస్థ అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం  ‘సంక్రాంతి’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *