వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి…

-వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర కి విజ్ఞప్తి
-వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య శాఖ లో విధులు నిర్వహిస్తున్న అనేక క్యాడర్ లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని. మానవ సేవే మాధవ సేవగా భావించి విధినిర్వహణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయక ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో అనేక కష్టాలతో కుటుంబాలలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి సేవలను కొనసాగిస్తున్నారని వారికి గత మూడు నెలలుగా జీతాలు చెల్లింపులు లేవని, వెంటనే ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర చొరవ తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగులకు రావలసిన జీతాల మంజూరుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావు, రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *