విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ్యుయులరీ రంగంలో విశేష అనుభవం గల వేగా జువెలరీస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ఎంజి రోడ్ లోని ఎల్ ఇ పి ఎల్ మాల్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. బంగారు వజ్రాభరణాలలో అగ్రగామి వేగ జువెలరీ వినియోగదారుల కోసం విజయవాడ నగరంలో షోరూంను ప్రారంభించిన అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు నచ్చినవిధంగా ఆభరణాలు తయారు చేసే అందించడంలో వేగా ఎంతో ప్రావీణ్యతను సాధించిందని తెలిపారు. మెగా జ్యువలరీ మేనేజింగ్ పార్ట్నర్ వనమా నవీన్, వనమా సుధాకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జ్యువెలరీ హోల్‌సేల్ రంగంలో ఉన్నామని తెలిపారు. విజయవాడ కేంద్రంలో ఆభరణాల తయారీలో ప్రత్యేక డిజైన్లు అందరికీ అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ నందుగల పెద్దమ్మ గుడి ప్రీమియం జ్యువెలరీ స్టోరీ ను ప్రారంభించినట్లు తెలియజేశారు. బంగారు ఆభరణాలలో ప్రత్యేక స్టోర్ కావాలనే ఉద్దేశంతో ఎంజి రోడ్ లో ఈ స్టోర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇక్కడ ప్రీమియం జూలరీ తోపాటు డైమండ్ ఆభరణాలు, నక్షి జ్యువెలరీ, కుందన్ జువెలరీ పోలికే జ్యువెలరీ ప్రత్యేకత అని తెలిపారు పూర్తిస్థాయి బోటిక్ స్టైల్ గా స్టోర్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. వాళ్ల కోరిన డిజైన్లు ముందుగా ఆర్డర్ తీసుకుని అందించనున్నట్లు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …