అంబేద్కర్ ఆలోచ‌న‌లు ఎల్ల‌ప్పుడూ అత్యంత ఆద‌ర్శ‌నీయం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భావిత‌రాల కోసం భార‌త రాజ్యాంగానికి అంబేద్క‌ర్ రూప‌క‌ల్ప‌న చేశారని ఆయన ఆలోచ‌న‌లు ఎల్ల‌ప్పుడూ అత్యంత ఆద‌ర్శ‌నీయం అని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం ఆయన కృష్ణా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విశ్వ విద్యాలయంలో ప్రతిష్టించబడిన ఈ మహనీయుని ప్రతిమ నేటి విద్యార్థినీ విద్యార్థులకు ఆ తర్వాత ఇక్కడ చదువుకొనే వారందరికీ నిత్యం స్ఫూర్తిని కల్గించాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ దాత, ఐ ఆర్ ఈ ఎఫ్ సంస్థ డైరెక్టర్ రెబ్బా ఇమ్మానియేల్ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారతరత్నఅంబేడ్కర్ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా ఉందని, ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతో పాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ఆయన లోని గొప్పతనం గొప్ప దేశభక్తుడు కావటమే అంటూ పేర్కొంటూ, సాత్వికునిగా, సామరస్యునిగా అంబేద్క‌ర్ జీవించారన్నారు. మనదేశ ప్రజలు సైతం అలా జీవించాలని కోరుకున్నారని చెప్పారు. భారతీయులందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష అని అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించారన్నారు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలని కృష్ణా యూనివర్సిటీ విదార్ధినీ విద్యార్థులకు మంత్రి పేర్ని నాని బోధించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూప కల్పన చేయడం వల్లనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి సాధ్య పడుతుందని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
అనంతరం రాష్ట్ర ఎస్సి కమీషన్ ఛైర్మెన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, అంబేడ్కర్ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశారని, అంబేడ్కర్ ఉదయం చదువుతుండేవాడని, మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవారని, రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవారని ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేనా అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవారని ఒక్కోరోజు బాబా సాహెబ్ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవారని, సమాజంలో విద్య మాత్రమే వ్యక్తికి గౌరవ మర్యాదలు తీసుకువస్తుందని కృష్ణా విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులకు ఎస్సి కమీషన్ ఛైర్మెన్ సూచించారు. మనస్మృతిలో కొన్ని వర్ణాల వారిని చూడటమే నిషేధించబడిందని, మనిషిని మనిషిగా చూడటమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17తో తిప్పికొట్టారని తెలిపారు. ఆయనలోని మహోన్నత సామాజిక, విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్ నిర్మాణంలోనే ఉందని అన్నారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చివేసిందని ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారని వివరించారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారని వాటిని మనకు అంబేడ్కర్ చెప్పారని తెలిపారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు జోగి రమేష్ , మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ కె. బి. చంద్రశేఖర్, మునిసిపల్ కమీషనర్ ఎస్. శివరామకృష్ణ, 31 వ డివిజన్ కార్పొరేటర్ యండ్రపాటి నాగేశ్వరావు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కుల ఆనంద్ ( జానీ ), కో – ఆప్షన్ సభ్యులు బేతపూడి రవి, మాజీ కౌన్సిలర్ కొక్కిలిగడ్డ శరత్, మత్తె నాగరాజు, రమేష్ ( పాండే ), బూరుగ రామారావు, పలువురు దళిత నాయకులు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు బోధన సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *