Breaking News

జగనన్న వసతి దీవెన -రెండవ విడత నిధుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న వసతి దీవెన -రెండవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్‌టిఆర్‌ జిల్లాలో 2021-22 సంవత్సరంలో 41 వేల 906 మంది విద్యార్థులకు 40.06 కోట్ల రూపాయల నిధులను 37 వేల 384 మంది తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందని కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీ రావు అన్నారు.
నంద్యాల నుండి శుక్రవారం వసతి దీవెన పథకం కింద 2021-22 సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ నగదును అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు మంజూరు చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
నగరంలోని కలెక్టరేట్‌ నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీ రావు, డిఆర్‌ఓ కె. మోహన్‌కుమార్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణువర్థన్‌, భట్రాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కూరపాటి గీతాంజలిదేవి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమల పూర్ణమ్మ, డిప్యూటి మేయర్లు, బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, జిల్లా ఎస్‌సి వెల్ఫెర్‌ ఎంపవర్మెంట్‌ ఆఫిసర్‌ బి. విజయ భారతి, జిల్లా మైనార్టీ వెల్ఫెర్‌ ఆఫీసర్‌ రియాజ్‌ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో వసతి దీవెన పథకంలో 2021`22 సంవత్సరానికి 41,906 మంది విద్యార్థులకు సంబంధించి అర్హులైన 37,384 మంది తల్లుల ఖాతాలకు రూ.40.06 కోట్లు జమచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు అన్నారు.
వీరిలో ఎస్సీ సంక్షేమం కింద 10,400 మంది విద్యార్థులు ఉండగా వారిలో 9,262 మంది తల్లుల ఖాతాలకు 9 కోట్ల 87 లక్షల 25 వేలు,
ఎస్టీ సంక్షేమం కింద 1,548 మంది విద్యార్థుల ఉండగా వారిలో 1,396 మంది తల్లుల ఖాతాలకు కోటి 45 లక్షల 87 వేలు,
బిసి సంక్షేమం కింద 17,127 మంది విద్యార్థుల ఉండగా వారిలో 15,252 మంది తల్లుల ఖాతాలకు 16 కోట్ల 33 లక్షల 62 వేలు,
ఇబిసి సంక్షేమం కింద 6,035 మంది విద్యార్థుల ఉండగా వారిలో 5,510 మంది తల్లుల ఖాతాలకు 5 కోట్ల 89 లక్షల 67 వేలు,
ముస్లిమ్‌ మైనారిటి సంక్షేమం కింద 2,735 మంది విద్యార్థుల ఉండగా వారిలో 2,454 మంది తల్లుల ఖాతాలకు 2 కోట్ల 60 లక్షల 85 వేలు,
కాపు సంక్షేమం కింద 3,755 మంది విద్యార్థుల ఉండగా వారిలో 3,389 మంది తల్లుల ఖాతాలకు 3 కోట్ల 59 లక్షల 07 వేలు,
క్రిస్టియన్‌ మైనారిటి సంక్షేమం కింద 306 మంది విద్యార్థుల ఉండగా వారిలో 265 మంది తల్లుల ఖాతాలకు 29 లక్షల 67 వేలు జమ చేయడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు.
అనంతరం విద్యార్థులకు 40.06 కోట్ల రూపాయల చెక్‌ను కలెక్టర్‌, శాసనసభ్యులు, కార్పొరేషన్‌ చైర్మన్లు అందజేశారు.
విద్యార్థుల మనోభావాలు: అనూష
ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న అనూష మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న నవరత్నాలను తమ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ స్వదినియోగం చేసుకుంటున్నామన్నారు. తన తండ్రి ఆటోడ్రైవర్‌ అని వాహన మిత్ర పథకం ద్వారా లబ్ది పొందుతున్నామని, తనకు వసతి దీవెన వలనే తనూ చదువుకుంటునానని, తన తల్లికి వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా లబ్ది చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *