విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో గృహానిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి అర్బన్ లేఅవుట్లలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండపల్లి అర్బన్ లేఅవుట్లలో లబ్దిదారులకు మంజూరైన 1,515 ప్లాట్స్ నిర్మాణాలలో ఇప్పటికే 600 ప్లాట్స్ నిర్మాణాలు స్ల్యాబ్ పూర్తి అయి తుది దశకు చేరుకున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మిగిలిన నిర్మాణాలను లబ్దిదారులతో త్వరితగతిన ప్రారంభింపచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం ఈలప్రోలు లేఅవుట్‌లోని 40 ప్లాట్లలలో జరుగుతున్న పనులను పరిశీలించి తక్షణమే విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
లేఅవుట్ పరిశీలనలో కలెక్టర్‌తో పాటు జిల్లా గృహా నిర్మాణ శాఖాధికారి వి.శ్రీదేవి, తహాశీల్థార్ సూర్యరావు, కొండపల్లి మున్సిపల్ కమీషనర్ పి. శ్రీథర్, ఈలప్రోలు గ్రామ సర్పంచ్ కె. రంగారావు, స్థానిక నాయకులు ఉన్నారు.
Prajavartha Online Telugu News