Breaking News

కార్డుదారులకు రేషన్‌ సరుకుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్డుదారులకు రేషన్‌ సరుకుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.
విజయవాడ రూరల్‌ గ్రామ సచివాలయం -3 వద్ద మొబైల్‌ డిస్పెంన్సింగ్‌ వాహనాల ద్వారా లబ్దిదారులకు జరుగుతున్న రేషన్‌ పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎన్‌ అజయ్‌ కుమార్‌ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నేటి నుండి ప్రారంభించిన రేషన్‌పంపిణీ త్వరితగతిన కార్డు దారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉన్న 958 రేషన్‌ దుకాణాలకు ఎఫ్‌సిఐ గోడౌన్‌ నుండి రవాణా చేయడం జరిగిందని ఆమె అన్నారు. జిల్లాలోని 5,86,301 బియ్యం కార్డుదారులకు 374 మొబైల్‌ డిస్పెంన్సింగ్‌ వాహనముల ద్వారా నేటి నుండి ప్రారంభమైన రేషన్‌ను ప్రాణాళిక బద్దంగా కార్డుదారుని ఇంటి వద్దకే అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

నున్న లేఅవుట్‌ను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌
నున్న లేఅవుట్‌లో జరుగుతున్న గృహానిర్మాణ పనులను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎన్‌ అజయ్‌ కుమార్‌ పరిశీలించారు. లేఅవుట్‌లో నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జరుగుతున్న నిర్మాణాలలో ముఖ్యంగా బెస్‌మెంట్‌ స్థాయి నుండి రూప్‌ స్థాయి వరకు, రూప్‌ లెవల్‌ నుండి స్లాబ్‌ లెవల్‌ వరకు తీసుకురావాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.
అనంతరం నున్నలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *