విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని రైల్వే ఖాళీ స్థలంలో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం తెలియజేసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రమాద తీవ్రతను తగ్గించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట 60వ డివిజన్ వైసీపీ కోఆర్డినేటర్ బెవర నారాయణ, నాయకులు బత్తుల దుర్గారావు, ఆటో బాబు, కిరణ్, ఇస్మాయిల్, ఫాతిమా తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …