మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత 35 నెలల్లోనే కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల చేతుల్లోకి వెళ్లిందిని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. కరోనా వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురు తిరిగినా, చెక్కుచెదరని సంకల్పం చూపించాం అన్నారు. ఇంతలా మనసున్న పాలనను గతంలో అక్క చెల్లెమ్మలు ఎప్పుడైనా చూశారా అని పేర్కొన్నారు.తూర్పు నియోజకవర్గంలోని రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్ ప్రాగణంలో 15,16,17,18, డివిజన్ పరిధిలోని వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నగదు జమ వారోత్సవ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తో పాటు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ , నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు ఉమ్మడిశెట్టి రాధిక, తంగిరాల రామిరెడ్డి పాల్గొని 1077 మహిళల ఖాతాల్లో ఒక కోటి 14 లక్షలు రూపాయలు చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ పథకం కింద ఈ మూడు సంవత్సరాల్లో ‌3,615 కోట్లు అందజేశామని చెప్పారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ.. తదితర పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల చరిత్రను మార్చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు ను ప్రజలు అందరూ ఖండించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మహిళలు అండగ ఉండాలని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు నిధులు ప్రభుత్వ పథకాల కింద జమ చేయడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక,17వ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగురాల రామిరెడ్డి,18వ డివిజన్ సీనియర్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, నగవశం డైరెక్టర్ సుజాత,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చెల్లారావు, మాజీ సీనియర్ కార్పొరేటర్ బహదూర్,సీడీఓ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *