విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో 5,16,17,18,19,21,22 డివిజన్ లకు చెందిన 16 మంది లబ్దిదారులకు దాదాపు రూ.18,00,000 ముఖ్యమంత్రి సహయనిది చెక్కులను అందచేసిన వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ముఖ్యమంత్రి సహయనిది వరంలా బాధితులకు ఉపయోగపడుతోందని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ గారి ప్రభుత్వం పేదలకు ఆరోగ్యభద్రత కల్పిస్తోందన్నారు. పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం అందడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యాలతో ఆర్థికంగా చితికిన తమకు ముఖ్యమంత్రి సహయనిది ద్వారా అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్, మరియు దేవినేని అవినాష్ కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్ గారు,21వ డివిజన్ వైసీపీ నాయకులు పుప్పాల రాజా,22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి గారు మరియు వైస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …