-ఆసుపత్రుల్లో రోగులను పట్టించుకోరా
-పరీక్షల వేళా విద్యుత్ కోతలు
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ కోతలతో అంధకార ప్రదేశ్ గా మారుస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఆరోపించారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నా విద్యుత్ కోతలు సరి కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరులో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, పలు ఆస్పత్రుల్లో జనరేటర్ సౌకర్యం లేక రోగులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి కరెంట్సరఫరా నిలిపి వేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆసుపత్రులకు విద్యుత్ కోతలు అమలు చేయవద్దని మస్తాన్ వలీ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News