Breaking News

జిల్లావ్యాప్తంగా 1,40,165 మంది రైతు కుంటుంబాలకు రూ.77.09 కోట్లు మంజూరు

-వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం కార్యక్రమం పెడన లో
-వరుసగా నాలుగో ఏడాది 2022-23 సం.లో రైతులకు మొదటి విడత ఆర్ధిక సహాయం
-16న ఉదయం 11.00 గంటలకు పెడనలోని AMC లో జిల్లాస్థాయి ప్రారంభ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 16న వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం క్రింద వరుసగా నాలుగో ఏడాది కూడా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు.
2022-23 సంవత్సరములో మొదటి విడత ఆర్ధిక సహాయము క్రింద జిల్లావ్యాప్తంగా 1,40,165 మంది రైతు కుంటుంబాలకు వై.ఎస్.ఆర్ రైతు భరోసా@(రూ.5500/-) రూ.77.09కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయడం జరుగుతుందన్నారు. రైతుల యొక్క ఆధార్ లింకు అయిన బ్యాంకు ఖాతాలకు పైమొత్తము నగదు జమ చేయబడునని తెలిపారు. ఇందుకు సంబంధించి పెడన పట్టణ కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో 16న ఉదయం 11.00 గంటలకు లాంఛనంగా వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎమ్ కిసాస్ జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం
రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి అక్టోబర్, 2019 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకమును అమలు చేయుచున్నది. అర్హులైన భూ యజమాని కుటుంబాలను ఈ పథకం కింద లబ్దిదారులుగా గుర్తించి వారికి:-
**మొదటి విడత రూ.5500/- పి.ఎమ్ కిసాన్ లబ్ది రూ.2000/- లను కలిపి మేనెలలో..
** రెండవ విడత రూ.2000/- పిఎంకిసాన్ లబ్ది రూ .2000/- లను కలిపి అక్టోబర్ నెలలో..
**మూడవ విడత రూ 2000/- లను ప్రత్యేకంగా పిఎం కిసాన్ లబ్దిని జనవరి నెలలో అందజేయడంజరుగుచున్నది.
*అదేవిధంగా భూమిలేని షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులము, వెనకబడిన కులము మరియు మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుంటుంబాలకు, దేవాదాయ భూములు మరియు అటవీ భూమీ సాగుదారులకు సంవత్సరానికి రూ.13,500/- చొప్పున ఆర్ధిక సహాయం 3 విడతలలో రైతుల ఖాతాల్లోకి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతున్నది .
* మొదటి విడత రూ.7500/- లబ్దిని మే నెలలో..
* రెండవ విడత రూ.4000/- లబ్దిని అక్టోబరు నెలలో
* మూడవ విడత రూ.2000/- లబ్దిని జనవరి నెలలో అందజేయడం జరుగుతుంది.

సామాజిక తనిఖీ :-
◆ వంద శాతం పారదర్శకతతో ఈ పథకం అమలు చేయడం జరుగుతోంది.
◆ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులు మరియు అనుర్హులను గుర్తించుటకు గాను రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్దిదారుల జాబితాలను ప్రదర్శించడం జరిగింది.
◆ ప్రతి రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై అవగాహన కార్యక్రమాలను జరిపి అందులో అర్హులై ఉండి లబ్ధి పొందని వారిని గ్రీవన్స్ పోర్టల్లో పొందుపరచడం అలాగే అర్హతలేని వారికి లబ్ధిని ఆపే విధంగా అన్ని చర్యలు తీసుకొనబడినవి.
★2022-23 సంవత్సరములో నియోజకవర్గం వారీగా వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత ఆర్ధిక సహాయము పొందే లబ్ధిదారుల వివరాలు
1. నియోజకవర్గం పేరు : మచిలీపట్నం
లబ్ధిదారుల సంఖ్య : 8,509
లబ్ధి విలువ. : రూ.4.67 కోట్లు.
2. నియోజకవర్గం పేరు : పెడన
లబ్ధిదారుల సంఖ్య : 24,289
లబ్ధి విలువ. : రూ.13.35 కోట్లు.
3. నియోజకవర్గం పేరు : అవనిగడ్డ
లబ్ధిదారుల సంఖ్య : 31,351
లబ్ధి విలువ : రూ.17.24 కోట్లు.
4. నియోజకవర్గం పేరు : గుడివాడ
లబ్ధిదారుల సంఖ్య : 11,365
లబ్ధి విలువ. : రూ.6.25 కోట్లు
5. నియోజకవర్గం పేరు : పామర్రు
లబ్ధిదారుల సంఖ్య : 30,398
లబ్ధి విలువ. : రూ.16.71 కోట్లు.
6. నియోజకవర్గం పేరు : పెనమలూరు
లబ్ధిదారుల సంఖ్య : 9,570
లబ్ధి విలువ. : రూ.5.26 కోట్లు.
7. నియోజకవర్గం పేరు : గన్నవరం
లబ్ధిదారుల సంఖ్య : 24,683
లబ్ధి విలువ. : రూ.13.57 కోట్లు.
ఈనెల 16న వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం జిల్లా స్థాయి కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు పెడన మార్కెట్ కమిటీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ” వైఎస్సార్ రైతు భరోసా పథకం “లో భాగంగా రైతన్నలకు భరోసా కల్పిస్తూ 4 వ విడత ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష గారు ప్రజా ప్రతినిధులు అధికారులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, ప్రజలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *