ఇంద్రకీలాద్రి, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికా లో శాన్ ఫ్రాన్సిస్కో నగరం లో వున్న Milpitas పట్టణం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం లో శుక్రవారం, 27 మే తేదీన దుర్గమ్మ వారి పూజలు మొదలయ్యాయి. ఉదయం 11గంటలకు ఒక బ్యాచ్, సాయత్రం 6.30గంటలకు ఇంకొక బ్యాచ్ లో మహిళలు కుంకుమ పూజ చేస్తూ ఖడ్గ మాల, శ్రీచక్ర నవావరణ పూజలలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి దేవాలయం వారు పూజలో పాల్గొనే మహిళలకి పూజా సామాగ్రి ఇచ్చి నిష్ట గా పూజ చేసుకొనే వీలు కల్పించారు. ముందుగా సత్య నారాయణ స్వామి దేవాలయం చైర్మన్ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి, ప్రెసిడెంట్ దయాకర్ దువ్వూరు అందరినీ ఆహ్వానించారు. దేవాదాయ శాఖ, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున వేంకట సుబ్బారావు చెన్నురి ప్రస్తుతం దేవాదాయ శాఖ ప్రవేశ పెట్టిన పరోక్ష సేవ వంటి పథకాలు వివరించారు.
Prajavartha Online Telugu News