రామవరప్పాడు, నేటి పత్రిక ప్రజావార్త:
రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సమ్మెట సాంబశివరావు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సమ్మెట సాంబశివరావు మాట్లాడుతూ రామవరప్పాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ ప్యానెల్‌కు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ రూరల్ మండల నాయకులు కొమ్ము కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు, కాకర్లమూడి సువర్ణరాజు, మెండే సుధాకర్, అల్లాడి శ్రీనివాసరావు, మైనారిటీ నాయకులు జానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రామవరప్పాడు వైఎస్సార్ సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సమ్మెట సాంబశివరావు నామినేషన్
