రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 15 కోర్టు లలో ది.26.06.2022 న (ఆదివారం) జాతీయ లోక్ అదాలత్ (వర్చ్యుయల్ మరియు హైబ్రిడ్) విధానములో నిర్వహించడం జరుగు తుందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకట జ్యోతిర్మయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఈ దిగువ తెలిపిన కోర్టు ల యందు ది. 26.5.2022న జాతీయ లోక్ ఆధాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
నూతన జిల్లాల వారీగా :
తూర్పు గోదావరి జిల్లా లోని… రాజమహేంద్రవరం , అనపర్తి లలో
కాకినాడ జిల్లాలోని కాకినాడ, పిఠాపురం , పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు లలో,
కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేట లలో
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, అడ్డతీగల లలోని కోర్టులలో
ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడును. కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల వ్యాప్తంగా ఉన్న 15 కోర్టు లలో జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు ది. 26.06.2022 న (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను వర్చ్యుయల్ మరియు హైబ్రిడ్ విధానములో పరిష్కరించు కొనవలసినదిగా తెలియజేసినారు. ఈ అవకాశ న్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూష కుమారి కోరారు.
Prajavartha Online Telugu News